వెంకీ మామ మోస్ట్ అవైటెడ్ సినిమా కూడా ఓటిటి లోనా.?

Published on Jun 27, 2021 10:26 am IST

మన టాలీవుడ్ ఆల్ టైం మోస్ట్ లవబుల్ స్టార్ హీరోలు ఇద్దరే ఇద్దరు వారు ఒకరు విక్టరీ వెంకటేష్ మరొకరు మాస్ మహారాజ్ రవితేజ. ఇప్పుడు వీరిద్దరూ కూడా పలు ఆసక్తికర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అయితే అందరి వెంకీ మామ నటించిన రెండు చిత్రాలు ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరి వాటిలో “దృశ్యం 2” అయితే జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసేసారు.

కానీ దానికంటే ముందే నటించిన ఇంటెన్స్ థ్రిల్లర్ “నారప్ప” కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తుంది. బహుశా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కే రావచ్చట. ఇన్ని రోజులు మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ కే స్టిక్ అయ్యి ఉన్నారు కానీ ఇప్పుడు ఓటిటికే ఓటు వేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే దృశ్యం 2 కూడా ఓటిటి రిలీజ్ కే ఫిక్స్ అయ్యింది. మరి దాని హక్కులు తీసుకున్న ప్రైమ్ వీడియో వారే నారప్ప ను కూడా కొనుగోలు చేశారట. అలాగే రిలీజ్ డేట్ పై కూడా అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :