‘వెంకీ’ కామెడీ ‘ఎఫ్ 2’ బీట్ చేస్తోందట !

Published on Apr 26, 2019 4:05 pm IST

బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ – యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో వస్తోన్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాలో చైతు పెళ్లి చూపులు ఎపిసోడ్ ఒకటి ఉంటుందట.

ఆ ఎపిసోడ్ లో వెంకీ కామెడీ టైమింగ్ అదిరిపోతుందని.. ముఖ్యంగా పెళ్లి చూపుల్లో వెంకటేష్ టైమింగ్ అద్భుతమైన కామెడీని జనరేట్ చేస్తోందని చిత్రబృందం చెబుతుంది. మొత్తానికి వెంకీ వల్ల ఆ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోందట. ఈ సినిమాలో ‘వెంకీ’ కామెడీ ‘ఎఫ్ 2’లో వెంకీ కామెడీని బీట్ చేస్తోందట. ఇక ఈ సినిమాలో వెంకీ పల్లెటూరి వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :