మన టాలీవుడ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ చిత్రమే వెంకీ మామ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ లతో దర్శకుడు అనీల్ రావిపూడి చేస్తున్న సినిమా అని చెప్పాలి. ఆల్రెడీ అనీల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ తో షురూ అయ్యిన ఈ ప్రాజెక్ట్ నుంచి మరో క్రేజీ అనౌన్స్మెంట్ వీడియో బయటకు వచ్చింది.
ఈసారి హీరోలు, హీరోయిన్స్ ఇంకా సంగీత దర్శకుడు కూడా అనీల్ రావిపూడితో కలిసి కనిపించారు. కత్తి పట్టుకొని వచ్చిన అనీల్ రావిపూడి రక్తంతోనే వీర తిలకం దిద్ది ఫన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. పైగా ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని ఖరారు చేసేసారు.
కానీ ఇన్నాళ్లు రాయలసీమ బ్యాక్ డ్రాప్ అంటే ఫ్యాక్షన్ అనే ముద్ర నుంచి ఈసారి ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రావిపూడి ఈ ప్రమోషనల్ వీడియోతో ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్ అలాగే కృతి శెట్టిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా జీ స్టూడియోస్ మరియు షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్టు ఖరారు చేసారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


