మామాఅల్లుళ్ళ పల్లెటూరి సరదాలు మాములుగా లేవు

Published on Oct 8, 2019 11:08 am IST

దసరా పండుగకు అల్లుడు చైతన్య,మామ వెంకటేష్ ల మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’ చిత్రంలోని ఫస్ట్ గ్లిమ్స్ వీడియో నేడు విడుదల చేశారు. మామ అల్లుళ్ళ పల్లెటూరి సరదాలు, పోరాటాలతో కూడిన వీడియో ఆకట్టుకొనేలా ఉంది. చైతూని ఉద్దేశిస్తూ వెంకీ చెప్పిన …”గోదావరిలో ఈత నేర్పా..,బరిలో ఆట నేర్పా..,ఇప్పుడు జాతరలో వేట నేర్పుతా…, డైలాగ్ దుమ్మురేపింది. పక్కా పల్లెటూరిని నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ మూవీ కనిపిస్తుంది.

దేశం కోసం ఆర్మీలో పనిచేసే జవాన్ పాత్ర చైతూ చేస్తుండగా , వెంకీ పల్లెటూరి రైతుగా కనిపిస్తారని సమాచారం. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరోయిన్స్ గా రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ దీపావళి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More