వెంకీమామ షూటింగ్ కు డేట్ ఫిక్స్ !

వెంకీమామ షూటింగ్ కు డేట్ ఫిక్స్ !

Published on Jan 29, 2019 4:40 PM IST

Venky chay

బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య కలిసి నటించనున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’ ఇటీవలే లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 21నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. హైద్రాబాద్లో జరుగునున్న మొదటి షెడ్యూల్ లో తొలిరోజు చైతు , రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ లో పాల్గొననున్నారు.

పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకీ సరసన హ్యూమా ఖురేషి నటించనుంది. కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు లో లేదా సెప్టెంబర్ లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు