లేటెస్ట్..”టైగర్ నాగేశ్వరరావు” కోసం వెంకీమామ.!

Published on May 21, 2023 2:00 pm IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వరరావు” కోసం తెలిసిందే. దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలు అయితే నెలకొల్పుకోగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసమే మేకర్స్ సాలిడ్ ప్లానింగ్ లు చేస్తున్నారు.

అలా సినిమా ఫస్ట్ లుక్ ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధం చేస్తుండగా ఆల్రెడీ తెలుగు మినహా మిగతా భాషల్లో ప్రముఖ ముఖ్య స్టార్స్ తో ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తుండగా లేటెస్ట్ గా అయితే తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తున్నారో మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ లుక్ కోసం అందరి ఫేవరెట్ హీరో వెంకీ మామ అయితే మేకర్స్ తీసుకున్నారు. తాను ఈ అవైటెడ్ లుక్ ని తన వాయిస్ ఓవర్ తో అయితే పరిచయం చేయనున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు తెలిపారు. దీనితో వెంకీ మామ తన అగ్రెసివ్ వాయిస్ లో టైగర్ నాగేశ్వరరావు ని పరిచయం చేయడం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :