ఎఫ్ 2 చిత్రీకరణ ప్రారంభం !

Published on Jul 5, 2018 10:30 am IST


విక్టరీ ‘వెంకటేశ్‌ , వ‌రుణ్ తేజ్’ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ ట్యాగ్ లైన్‌ . కొద్దీ రోజులక్రితం ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఈ రోజునుండి ప్రారంభమైంది . ఈ షెడ్యూల్ ఈ నెల 21 వరకు జరుగనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కు జోడిగా త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ కు జోడిగా మెహ‌రీన్ న‌టిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఇక మొదటిసారి వెంకీ, వరుణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :