‘ఎఫ్ 2’లో అన్నదమ్ములుగా నటించనున్న వెంకీ , వరుణ్ !

‘ఎఫ్ 2’లో అన్నదమ్ములుగా నటించనున్న వెంకీ , వరుణ్ !

Published on Jun 20, 2018 3:16 AM IST


‘వెంకటేశ్‌ , వ‌రుణ్ తేజ్ లు కలిసి నటిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ ట్యాగ్ లైన్‌ . హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాలో వెంకటేశ్ కు జోడిగా త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ కు జోడిగా మెహ‌రీన్ న‌టిస్తున్నారు.

అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ సినిమాను కూడా పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా తెర‌కెక్కిన్చనున్నారు .ఇక ఈ సినిమాలో వెంకీ ,వరుణ్ అన్నదమ్ములుగా కనిపించనున్నారు . అన్నదమ్ములు అంటే సొంత అన్నదమ్ములుగా కాదు తోడల్లుళ్లుగా నటించనున్నారు . ఈ సినిమాని ఈనెల 23న గ్రాండ్ గా లాంచ్ చేసి జులై మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు