‘వెంకీ మామ’ఫై క్లారిటీ వచ్చింది !

Published on Oct 27, 2018 3:46 pm IST

విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య కలిసి నటించనున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’ ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయినా విషయం తెలిసిందే. షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే గత కొద్దీ రోజులుగా ఈ చిత్రం క్యాన్సల్ అయ్యిందని ఈ చిత్ర కథ సురేష్ బాబు కు నచ్చలేదని అందుకే చిత్రాన్ని ఆపేశారని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు వీటిపై క్లారిటీ వచ్చింది. సినిమా ఆగిపోలేదని అవ్వని కేవలం రూమ్లరు అని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ తెరకెక్కించనున్న ఈ చిత్రం వచ్చే నెల రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటగా నాగ చైతన్య ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇక వెంకీ ‘ఎఫ్ 2’ చిత్రీకరణ ను పూర్తి చేసిన తరువాత ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో హ్యూమా ఖురేషి , రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటించనున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :