నాన్ స్టాప్ షూటింగ్ లో వెంకీమామ !

Published on Apr 1, 2019 10:28 am IST

విక్టరీ వెంకటేష్ , యువ సామ్రాట్ నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీమామ ఇటీవలే రాజమండ్రి లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అయితే వెంకీ తన కూతురి పెళ్లి కోసం అలాగే చైతూ మజిలీ ప్రమోషన్స్ కోసం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఏప్రిల్ 8న సార్ట్ కానుందని సమాచారం. జూలై చివరి వరుకు ఎలాంటి బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ షూటింగ్ ను జరుపుకోనుంది ఈ చిత్రం. కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ అలాగే నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.

బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సీజన్ లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More