ఇటీవలే ‘ఎఫ్ 2’ అనే మల్టీ స్టారర్ తో బంపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. నాగ చైతన్య కలిసి వెంకీ నటించనున్న ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ చిత్రం యొక్క షూటింగ్ ఫిబ్రవరి 22 నుండి ప్రారంభం కానుంది. ఇక ఈ మొదటి షెడ్యూల్ ను రాజమండ్రి లో చిత్రీకరించనున్నారు. పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రీయ శరన్ అలాగే చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు.
కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు లో లేదా సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


