ఇక టాలీవుడ్ నెంబర్ వన్ కమెడియన్ ఆయనేనా…?

Published on Aug 31, 2019 12:37 pm IST

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా వెలిగిపోతున్నారు వెన్నెల కిషోర్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆయన ప్రతి సినిమాలో కనిపిస్తున్నారు. ఆయన మార్కు కామెడీతో నవ్వులు పంచుతున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ మొదటి ఛాయస్ గా వెన్నెల కిషోర్ మారారు.

బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్ వంటి స్టార్ కమెడియన్స్ వివిధ కారణాలతో ఇండస్ట్రీ లో ప్రభావం కోల్పోయారు. వీరి తరువాత కొంచెం పేరు సంపాదించిన సప్తగిరి, షకలక శంకర్ వంటివారు హీరోలుగా మారడంతో వెన్నెల కిషోర్ కి పోటీ లేకుండా పోయింది.దానికి తోడు ఎటువంటి పాత్రకైనా నప్పే వెన్నెల కిషోర్ మేనరిజం ఆయనకు అవకాశాలు తెచ్చి పెడుతుంది.

ఇటీవల విడుదలైన మన్మధుడు 2 చిత్రం అన్నివిధాలుగా విమర్శల పాలైనప్పటికీ, ఒక్క వెన్నెల కిషోర్ పాత్ర మాత్రం ప్రశంసలందుకుంది. ప్రతిష్టాత్మక సాహో చిత్రం లో కూడా టాలీవుడ్ నుండి కేవలం వెన్నెల కిశోర్ మాత్రమే అవకాశం దక్కించుకోవడం గమనార్హం. దీనితో ప్రస్తుతానికి టాలీవుడ్ నంబర్ వన్ కమెడియన్ వెన్నెల కిషోర్ అనడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం :