జై సింహ ఆడియో ప్లేస్ మారింది !

బాలకృష్ణ తాజాగా ‘జై సినిమా’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నఠాషా దోషిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ మూవీకి వర్క్ చెయ్యడం విశేషం.

ఈ చిత్ర ఆడియో వేడుకను ముందుగా విజయవాడ హాయ్ ల్యాండ్ లో ఘనంగా జరపడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ తాజా సమాచారం మేరకు ఆడియో వేడుకను విజయవాడలోనే వజ్ర గ్రౌండ్ప్ లో జరపడానికి చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ నెల 24 లో జరగబోయే ఈ ఫంక్షన్ కు భారీగా అభిమానులు రానున్నారు.