అరవింద సమేత ప్రీ రిలీజ్ వేడుకకు వేదిక ఖరారు !

Published on Sep 29, 2018 2:17 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 2న భారీ స్థాయిలో జరుగనుందని తెలిసిందే. తాజాగా ఈ వేడుకకు వేదికను ఖరారు చేశారు. హైద్రాబాద్లోని నోవాటెల్ హోటల్ లో ఈ ఈవెంట్ జరుగనుంది. తెలుగు రాష్ట్రానుండి ఎన్టీఆర్ అభిమానులు భారీ గా రానున్నడంతో వేడుకకు ఈ హోటల్ అయితేనే బాగుంటుందని భావించి అక్కడ జరుపుతున్నారట. ఇక ఈవేడుకలో చిత్రం యొక్క ట్రైలర్ ను విడుదలచేశే అవకాశం ఉందని సమాచారం.

త్రివిక్రమ్ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ అలాగే ఆయన రాయలసీమ యాసలో చెప్పే డైలాగ్స్ హైలైట్ అవ్వనున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :