విశాల్ ‘యాక్షన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.

Published on Nov 8, 2019 9:35 am IST

యంగ్ హీరో విశాల్ రీసెంట్ గా తమిళంలో అయోగ్య చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. కరెప్టెడ్ పోలీస్ అధికారి పాత్రలో విశాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎన్టీఆర్ -పూరి కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రానికి ఇది తమిళ రీమేక్. కాగా విశాల్ తాజా చిత్రం యాక్షన్ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 15న తెలుగు మరియు తమిళ భాషలలో యాక్షన్ విడుదల కానుంది. విశాల్ కల్నల్ శుభాష్ అనే సీరియస్ అధికారి పాత్ర చేస్తుండగా దర్శకుడు సి సుందర్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ మరియు ట్రైలర్స్ కి మంచి స్పందన లభించింది. కాగా రేపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.

టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో దాసపల్లా కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమం రేపు సాయంత్రం జరగనుంది. టెర్రరిజం పై ఓ అధికారి చేసే పోరాటమే ఈ మూవీ అని తెలుస్తుంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా అండర్ కవర్ కాప్ పాత్ర చేయడం విశేషం. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీనివాస్ ఆడెపు సమర్పిస్తుండగా హిప్ హాప్ తమీజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More