‘రంగస్థలం’ ఘన విజయాన్ని అందుకున్న సందర్బంగా చిత్ర నిర్మాతలు ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ వేడుక ఎప్పుడు, ఎక్కడ జరుగఫుతుందనే దానిపై మాత్రం రకరకాల వార్తలు వినిపించిన నైపథ్యంలో ఎట్టకేలకు డేట్, వెన్యూని ఫిక్స్ చేశారు నిర్మాతలు.
ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరుగనుంది. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతుండటంతో మెగా అభిమానులు భారీ సంఖ్యలో భారీగా తరలిరానున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లకు పైగానే షేర్ ను వసూలు చేసింది.


