ఇంటర్వ్యూ : లక్ష్మణ్ – సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా అనిపిస్తుంది !

Published on Jul 31, 2018 5:41 pm IST

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. ఈచిత్రం జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను రాబడుతుండడంతో చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య మీడియా తో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది ?

చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు అమ్మాయిలనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అలాగే ఓవర్సీస్ నుండి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయ్.

ఈ అవకాశం ఎలా వచ్చింది ?

ఇంతకుముందు సుమంత్ అశ్విన్ తో ఎందుకిలా ? అనే వెబ్ సిరీస్ చేస్తున్నపుడు ఆయనకు ఈ కథ చెప్పాను ఆ తరువాత ఆయన పాకెట్ సినిమాస్ ను పరిచయం చేశారు వారికీ కూడా కథ నచ్చడంతో సినిమా చేశాం.

నిహారిక నే ఎందుకు తీసుకోవాలనిపించింది ?

ఈ కథ అంతా హీరోయిన్ చుట్టు తిరిగేది కావడంతో ఈ పాత్రకు తెలుగు అమ్మాయి అయితే కరెక్ట్ అనిపించింది నిహారికకు ముందు మరో ఇద్దరి పేర్లను అనుకున్నాం . కానీ ఎందుకో ఈ పాత్రకు ఆమె అయితేనే బాగుంటుందని అందరం అనుకోని ఆమెను తీసుకున్నాం.

మొదటి సినిమాతోనే నరేశ్, మురళి శర్మ వంటి సీనియర్ నటులను డైరెక్ట్ చేశారు ఎలా అనిపించింది ?

అది ప్రొడక్షన్ హౌస్ కలిపించిన అదృష్టం . సెట్ లతో వారితో ఎలాంటి ఇబ్బంది రాలేద. షూటింగ్ జరుగుతున్నపుడు సీన్ పేపర్ చూసుకోని ఎలా చేస్తే బాగుంటుందని అనుకోవడం ఆలా వారితో సరదాగా గడిచిపోయింది.

నాగబాబు గారు ఈ సినిమా చూశారా ?

చూశారు. సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆయన ఆలా అనడంతో నాకు చాలా సంతోషమేసింది.

మీకు వచ్చిన అతి పెద్ద కాంప్లిమెంట్ ?

నిహారిక గారు దగ్గరినుండి వచ్చింది. సినిమా చూశాక నాకు ఫోన్ చేసి సార్ నా లైఫ్ లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోయింది ఈ చిత్రం థ్యాంక్స్ అని అన్నారు.

మీ తదుపరి చిత్రం గురించి ?

ప్రస్తుతం స్టోరీ నరేషన్ జరుగుతుంది త్వరలోనే కొత్త సినిమా కు సంభందించిన వివరాలను ప్రకటిస్తా.

సంబంధిత సమాచారం :