ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు. నిన్న ఆమెకు గుండెపోటు రావడంతో వెంటనే తేరుకున్న కుంటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చినా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే మరోసారి ఆమెకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆమె తుదిశ్వాస విడిచారు.
కాగా 1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ నటించారు. సీనియర్ హీరో రామకృష్ణను వివాహం చేసుకున్న గీతాంజలి అసలు పేరు మణి. 1961లో తొలిసారిగా సీతారామ కల్యాణం చిత్రంతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. కాగా, ఆమె చివరి సినిమా దటీజ్ మహాలక్ష్మి. ఇక గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.
123తెలుగు.కామ్ తరఫున ‘ గీతాంజలి’ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.


