
రాక్షసుడు సినిమాతో అంతగా మెప్పించలేకపోయిన తమిళనటుడు సూర్య ప్రస్తుతం తన తదుపరి సినిమా పనులలో బిజీగా వున్నాడు. ’24’ అనే టైటిల్ తో మనం దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబాయిలో శరవేగంగా జరుపుకుంటుంది. సమంతా హీరోయిన్.
సమాచారం ప్రకారం తమిళనటులు గిరీష్ కర్నాడ్, మోహన్ రామన్ లు సమంతాకి తాతయ్య, తండ్రి పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీరిద్దరి నడుమా ఇటీవలే కొన్ని ముఖ్యసన్నివేశాలను తెరకెక్కించారు.
ఈ చిత్రాన్ని సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్ లో నిర్మిస్తున్నారు. రెహమాన్ సంగీత దర్శకుడు. టాలీవుడ్ ఎడిటర్ ప్రవీణ్ పూడి ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. .

