తెలుగు సినీ పరిశ్రమలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, నిర్మాతగా ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న జయకృష్ణ ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఈ ఉదయం హైద్రాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. జయకృష్ణ పతాకంపై నాటితరం స్టార్ హీరోలతో 70,80,90ల దశకంలో జయకృష్ణ పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్‌గా అవతరించిన చిరంజీవి ‘మన ఊరి పాండవులు’ అనే సినిమాతో జయకృష్ణయే ఒక పెద్ద రోల్ ఇచ్చి ఇండస్ట్రీకి పూర్తి స్థాయి నటుడిగా పరిచయం చేశారు.
ఇక కొద్దికాలంగా పూర్తిగా సినిమాలను నిర్మించడం మానేసిన జయకృష్ణ, కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు. ఆయన మృతి పట్ల సినీ నిర్మాతల మండలితో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జయకృష్ణ మృతికి చింతిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 123తెలుగు తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాం.


