టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తూ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. జూన్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ ప్రస్తుతం శరవేగంగా చేస్తున్నారు. కాగా, ఈ క్రమంలో సోషల్ మీడియాలో సమంత చేసిన ఒక వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సామ్ ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని తొలుత స్టార్ బ్యూటీ సాయి పల్లవి కోసం అనుకున్నారని.. అయితే, ఆమె వేరే చిత్రాలతో బిజీగా ఉండటంతో కథలో కొన్ని మార్పులు చేసి తానే హీరోయిన్‌గా నటించానని సామ్ ఈ వీడియోలో తెలిపింది.
దీంతో ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సాయి పల్లవి ఉంటే ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక ఈ సినిమాలో సామ్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


