వైరల్ వీడియో : ముంబైలో శ్రీలీలకు అవమానం..?

వైరల్ వీడియో : ముంబైలో శ్రీలీలకు అవమానం..?

Published on Jun 22, 2026 2:30 PM IST

Sreeleela

టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీలకు ముంబైలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. అమృత ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని దివ్యాజ్ ఫౌండేషన్ ఎస్వీపీ స్టేడియంలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు షాహిద్ కపూర్, జాకీ ష్రాఫ్ లతో పాటు శ్రీలీల కూడా ప్రత్యేక అతిథిగా హాజరైంది. అయితే, అక్కడ ఫొటో సెషన్ జరుగుతున్న సమయంలో అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె దివిజలతో కలిసి శ్రీలీల పోజులిస్తుండగా.. అమృత ఆమెను చేత్తో పక్కకు తప్పుకోమని సైగ చేయడం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వీడియో చూసిన శ్రీలీల అభిమానులు మరియు నెటిజన్లు అమృత ఫడ్నవీస్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న ఒక పాపులర్ హీరోయిన్‌ను ప్రత్యేకంగా ఈవెంట్‌కు పిలిచి, అందరి ముందూ అలా ఫ్రేమ్ నుండి బయటకు వెళ్లమనడం ఖచ్చితంగా అవమానించడమేనని మండిపడుతున్నారు. అమృత ప్రవర్తన అహంకారంతో కూడుకున్నదంటూ సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.

అయితే, ఈ వివాదంపై సోషల్ మీడియాలో మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అక్కడ ఉన్న ప్రెస్ ఫొటోగ్రాఫర్లు కేవలం తల్లీకూతుళ్ల ఫొటోలు మాత్రమే సెపరేట్‌గా కావాలని కోరడం వల్లే ఆమె అలా స్పందించిందని, ఇందులో శ్రీలీలను అవమానించాలనే ఉద్దేశం లేదని కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఘటనపై ఇటు శ్రీలీల టీమ్ నుండి కానీ, అటు అమృత ఫడ్నవీస్ వైపు నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇరు వర్గాల నుండి క్లారిటీ వస్తేనే ఈ వివాదానికి పూర్తి బ్రేక్ పడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు