బాలకృష్ణకు తల్లిగా విద్యాబాలన్. జూలైలో మొదటి షెడ్యూల్ !

బాలకృష్ణకు తల్లిగా విద్యాబాలన్. జూలైలో మొదటి షెడ్యూల్ !

Published on Jun 5, 2018 3:00 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తన నిర్మాణంలో నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ బయోపిక్ లో ఏన్నో ముఖ్యమైన మరియు ప్రముఖమైన పాత్రలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్ర. ఈ పాత్ర కోసం నిత్యామీనన్ అని, విద్యాబాలన్ అని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. చివరకు ఆ పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నారు.

జులైలో విద్యాబాలన్, బాలకృష్ణ మీద మొదటి షెడ్యూల్ కూడా షూట్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ గారు బసవతారకంగారి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే దృశ్యాలను మొదటి షెడ్యూల్ లో తెరెకెక్కించనున్నారు. అయితే మొదటి షెడ్యూల్ కు తర్వాత షెడ్యూల్ కు చాలా గ్యాప్ ఉంటుందట. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆయన తండ్రి శివదత్త్ గారు టైటిల్స్ పడేటప్పుడు వినిపించే ఒక శ్లోకాన్ని రాయనున్నారు. మిగిలిన అన్నీ పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాస్తారు.

తాజా వార్తలు