మెగాస్టార్ సిస్టర్ గా విద్యాబాలన్ ?

మెగాస్టార్ సిస్టర్ గా విద్యాబాలన్ ?

Published on Jun 4, 2021 1:09 AM IST

మెగాస్టార్ చిరంజీవి రీమేక్ మూవీ “లూసిఫర్” సినిమా పై తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ ను సెట్ చేస్తే నిజంగానే అదిరిపోతుంది. తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని, చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పాత్ర పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో విద్యాబాలన్ నటిస్తే చాల బాగుంటుంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర చాల కీలకంగా ఉంటుంది. ఆ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారట. టైటిల్ పేరు ‘రారాజు’. నిజంగానే ఈ టైటిల్ మెగాస్టార్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మోహన్ రాజాకి ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. మోహన్ రాజా తమిళంలో “జయం” వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసి విజయాలు అందుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు