నయనతారలో నాకు నచ్చేది అదే – విఘ్నేష్‌ శివన్‌

Published on Jun 21, 2021 7:05 am IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌ గత కొన్ని సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో ఉండటం, అలాగే వీరి ప్రేమాయణం మొదలైన దగ్గర నుండి పెళ్లి అంటూ ఇప్పటికే అనేక రూమర్స్ వస్తున్నాయి. వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా విఘ్నేష్‌ శివన్‌ తన ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో చిట్‌ చాట్‌ చేశారు. అయితే, అందరూ నయనతారకు సంబంధించిన ప్రశ్నలే అడిగారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘అసలు నయనతారలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి?’ అని అడగగా, ఆ ప్రశ్నకు శివన్ సమాధానం ఇస్తూ.. ‘నయన్‌ లో నాకు నచ్చింది. ఆమె ఆత్మస్థైర్యం” అని విఘ్నేష్‌ చెప్పుకొచ్చాడు. ఇక నయనతార నటిస్తోన్న ‘నెట్రికన్‌’ ట్రైలర్‌ చాలా బాగుంది.. సినిమా ఎలా ఉండబోతుంది ?’ అని మరో నెటిజన్ అడగగా, ‘సినిమా అద్భుతంగా వచ్చింది’ అని విఘ్నేష్‌ బదులిచ్చాడు.

అయితే, నయన్ – శివన్ వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ ఎప్పుడు పలుకుతారో చూడాలి. ఏది ఏమైనా ఎప్పటినుండో నయనతార పెళ్లి రూమర్లు అనేక సార్లు హడావుడి చేసాయి, కానీ నయనతార మాత్రం ఎప్పటిలాగే తన ప్రేమ మైకంలోనే ఉండిపోయింది.

సంబంధిత సమాచారం :