నయన్ తో పెళ్లి నా చేతుల్లో లేదు – విగ్నేష్ శివన్ !

Published on Sep 19, 2018 9:19 pm IST

అగ్ర కథానాయిక నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ చాలా రోజులుగా ఇద్దరు ప్రేమలో వున్నారని తెలిసిందే. ఇటీవల వీరిద్దరు కలిసి అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆసమయంలో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో విగ్నేష్ శివన్ ను పెళ్లి గురించి ప్రశ్నించగా నా చేతుల్లో లేదు. ముందు నయనతార ను అడగాలి నాకు తెలియదు. మా అమ్మను అడిగిన తరువాత నా పెళ్లి గురించి చెబుతానని ఆయన అన్నారు. ఇక వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నయన్ ప్రస్తుతం అజిత్ తో ‘విశ్వాసం’ అలాగే మెగాస్టార్ చిరంజీవి తో ‘సైరా’ సినిమాల్లో నటిస్తుంది.

ఇక విగ్నేష్ శివన్ ఇటీవల సూర్య తో ‘థానా సెర్ధా కూటమ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈఏడాది ప్రారంభంలో విడుదలైన ఈచిత్రం మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో ఈచిత్రం ‘గ్యాంగ్’ పేరుతో విడుదలయింది. ఈసినిమా తరువాత విగ్నేష్ ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.

సంబంధిత సమాచారం :