భారీ బందోబస్తు మధ్య తలపతి 63 షూటింగ్ !

భారీ బందోబస్తు మధ్య తలపతి 63 షూటింగ్ !

Published on Feb 19, 2019 8:16 PM IST

ఇళయదళపతి విజయ్ – అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తలపతి 63’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చెన్నై లో వేసిన ప్రత్యేక సెట్ లో భారీ బందోబస్తు నడుమ అత్యంత రహస్యంగా జరుగుతుంది. షూటింగ్ కు సంబందించిన ఒక్క పిక్ కూడా లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అలాగే విజయ్ కు వున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఫాన్స్ షూటింగ్ కు ఆటంకం కలిగించే పరిస్థితి ఉండండంతో టైట్ సెక్యూరిటీ ని ఏర్పాటు చేశారట. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ కోచ్ పాత్రలో నటించనున్నాడు.

భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు . ఈచిత్రాన్ని దీపావళికి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు