ఇంటర్వ్యూ : హీరో విజ‌య్ ఆంటోని – నేను మంచివాడినా.. చెడ్డ‌వాడినా.. అనేదే కథ !

Published on Jun 4, 2019 5:44 pm IST

ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో జూన్ 7న రాబోతున్న అనువాద చిత్రం ‘కిల్లర్‌’. క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌ లో జరిగే ఓ మర్డర్‌ మిస్టరీగా వస్తోన్న ఈ సినిమాలో అషిమా నర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోని మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

 

ముందుగా, కిల్ల‌ర్ ఎలా మొదలైందో చెప్పండి ?

ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఆండ్రూ లూయిస్‌ నా క్లాస్‌మేట్‌, నా ఫ్రెండ్‌. తను చెప్పిన క‌థ న‌చ్చి వెంట‌నే చేస్తాన‌ని ఒప్పుకున్నాను. ఆయ‌న గ‌త చిత్రాలను కూడా చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు. ఆండ్రూతో క‌లిసి ప‌నిచెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే .. ఇది క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో జరిగే ఓ మర్డర్‌ మిస్టరీ. సినిమాలో చాల ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

 

ఇంతకీ.. ఈ చిత్రంలో కిల్ల‌ర్ ఎవ‌రు ?

నేనే ఈ సినిమాలో కిల్ల‌ర్‌ ని. అర్జున్‌ గారు పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించారు. అయితే కిల్లర్ ఎవరు అనేదాని కంటే.. ఎందుకు కిల్లర్ అయ్యాడనేది చాలా ఆసక్తిగా ఉంటుంది.

 

సినిమాలో మీకు బాగా న‌చ్చిన పాయింట్ ఏంటి ?

నచ్చిన పాయింట్ అని ప్రత్యేకంగా విడతీసి చెప్పలేము. నాకు మొత్తం స్ర్కీన్‌ ప్లే బాగా న‌చ్చింది. అయినా క‌థ లైన్ మాత్ర‌మే బాగుంటే సరిపోదు.. ఫుల్ స్ర్కిప్ట్‌ బాగుండాలి. ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ నాకు బాగా న‌చ్చిన తరువాతే ఈ సినిమా చేశాను.

 

సినిమాలో కిల్లర్ మీరే అంటున్నారు. మీ క్యారెక్టర్ నెగిటివా ?

నెగిటివ్ అని భావించలేము. ఏ మనిషి నెగిటివ్ కాదు, అతనికి ఎదురైనా పరిస్థితులే నెగిటివ్. నా పాత్ర వైవిధ్యంగా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇంత‌కు ముందు చిత్రాల్లో నేనెవ‌ర్నీ చంప‌లేదు. కానీ ఈ సినిమాలో నేను ఎందుకు చంపుతున్నాను.. ఎవ‌ర్ని చంపుతున్నాను. నేను మంచివాడినా… చెడ్డ‌వాడినా… ఏంటి అన్న‌దాని పైన స్టోరీ న‌డుస్తుంది.

 

అర్జున్‌ గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది ?

ఆయ‌న చాలా మంచి ప్రొఫెష‌న‌ల్ యాక్ట‌ర్‌. నేను బేసిక్‌ గా యాక్ట‌ర్‌ని కాదు. నేను మంచిగా న‌టించ‌డానికి ట్రై చేస్తున్నాను. నాకు ఏది మంచి యాక్టింగ్ ఏది కాదు అన్న‌ది నాకు తెలియ‌దు కాని నా ఉద్దేశం ప్ర‌కారం ఆయ‌న చాలా మంచి ప్రొఫెష‌న‌ల్ యాక్ట‌ర్‌. ఆయ‌న చాలా నీట్‌ గా పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. డెఫ‌నెట్‌ గా ఆయ‌న పాత్ర ఈ చిత్రాన్ని మంచి పొజిషన్ కి తీసుకువెళ్తుంది.

 

తెలుగులో మీరు స్ట్రైట్ మూవీ ఎప్పుడు చేస్తారు ?

ముందు నేను తెలుగు బాగా నేర్చుకోవాలండి. అప్పుడు స్ట్రైట్ తెలుగు మూవీస్‌ లో చేస్తాను. ప్ర‌స్తుతం నాకు హేమచంద్ర డ‌బ్బింగ్ చెప్తున్నారు.

 

మీరు స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్. మరి ఈ సినిమాకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను ఎందుకు పెట్టుకున్నారు ?

ప్ర‌స్తుతం నేను మ్యూజిక్ మీద ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. నా దృష్టి మొత్తం న‌ట‌న మీదే ఉంది. ఇక ఈ సినిమాకి సైమ‌న్‌.కె.సింగ్ చాలా అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది.

 

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

త‌మిళ్‌ లో ఖాకి అనే చిత్రం చేస్తున్నాను. అలాగే జ్వాలా అనే చిత్రంలో నటిస్తున్నాను. జ్వాలాలో ప్ర‌కాష్‌ రాజుగారు, జ‌గ‌ప‌తిబాబుగారు, అరుణ్‌విజ‌య్‌, స‌త్య‌రాజ్ లాంటి గొప్ప యాక్ట‌ర్స్‌ తో క‌లిసి చెయ్య‌బోతున్నాను. అలాగే ప్ర‌స్తుతం కంటిన్యూగా ప‌ది సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More