“బిచ్చగాడు 2″కి అన్నీ తానై విజయ్ ఆంటోనీ.!

Published on Sep 1, 2021 4:25 pm IST


సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ కలిగినటువంటి ఆర్టిస్ట్ లు చాలా అరుదుగా ఉంటారు. మరి ఆ అరుదైన లిస్ట్ లో కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ని చేర్చడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. తాను నటించిన “బిచ్చగాడు” సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఇప్పుడు దానికి సీక్వెల్ ని చేస్తున్నారు.

గత కొన్నాళ్ల కితమే అనౌన్స్ కాబడిన ఈ చిత్రం ఈరోజు నుంచే షూట్ ని స్టార్ట్ చేసుకోడానికి రెడీ అయ్యింది. అయితే ముందుగా విజయ్ సంగీత దర్శకునిగా పరిచయం అయ్యి తర్వాత హీరోగా అయ్యి కూడా మ్యూజిక్ ని అందించాడు.

మరి ఈ చిత్రానికి మొట్ట మొదటి సారిగా దర్శకత్వ భాద్యతలు చేపట్టిన విజయ్ ఆంటోనీ ఇదొక్కటే కాకుండా మరిన్ని పనులు కూడా తానే చేస్తాడట. హీరో, డైరెక్టర్ గానే కాకుండా సంగీతం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, కథ ఇంకా నిర్మాణం అన్నీ కూడా తానే నడిపించనున్నాడని సమాచారం. ఇలా ఇన్ని భాద్యతలు తనపై పెట్టుకున్న విజయ్ అందరి అంచనాలు అందుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :