గ్యాంగ్ స్టర్ భవానిగా విజయ్.

Published on Apr 2, 2020 7:13 pm IST

తలపతి విజయ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. తమిళ్ తో పాటు మిగతా పరిశ్రమలలో కూడా ఆయన ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. గత ఏడాది క్రిస్మస్ కానుకగా ఆయన విడుదల చేసిన బిగిల్ భారీ విజయం అందుకుంది. డొమెస్టిక్ గా 200 కోట్లు వసూళ్లు సాధించి అబ్బురపరిచింది. ప్రస్తుతం విజయ్ దర్శకుడు లోకేష్ కానరాజ్ దర్శకత్వంలో మాస్టర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కావాల్సివుండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

కాగా ఈ చిత్రంలో విజయ్ రెండు భిన్న రోల్స్ చేస్తున్నాడు. అందులో ఒకటి కాలేజీ ప్రొఫెసర్ కాగా మరొకటి గ్యాంగ్ స్టర్ రోల్. తాజా సమాచారం ప్రకారం ఆ గ్యాంగ్ స్టర్ నేమ్ భవాని అట. గ్యాంగ్ స్టర్ భవాని పేరంటే హడల్ అన్నట్లు ఉంటుందట. ఇక విజయ్ కి విజయ్ సేతుపతి మధ్య గ్యాంగ్ వార్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. గ్జివియర్ బిట్టొ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More