శిక్షణ ముగించుకొని ఇండియా చేరిన విజయ్

Published on Jan 19, 2020 10:00 pm IST

విజయ్ దేవరకొండ కొన్ని రోజులుగా థాయిలాండ్ లో కిక్ బాక్సింగ్ మరియు ఇతర యుద్ధ విద్యలందు శిక్షణ తీసుకుంటున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చిత్రంలో విజయ్ దేవరకొండ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ అనంతరం పూరి విజయ్ తో మూవీ ప్రకటించడంతో పాటు టైటిల్ ఫైటర్ గా ధృవీకరించారు. ఈ మూవీలో పాత్ర కొరకు విజయ్ థాయిలాండ్ వెళ్లి నిపుణుల సమక్షంలో కిక్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు. కాగా రేపు ముంబైలో ఫైటర్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనితో విజయ్ తిరిగి ఇండియా చేరుకున్నారట.

ఫైటర్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేయనున్నారు. ఇక అనన్య పాండే ఫైటర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. కాగా విజయ్ లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చే నెల 14న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More