మీకు మాత్రమే చెప్తా’ అంటున్న ‘విజయ్ దేవరకొండ’ !

మీకు మాత్రమే చెప్తా’ అంటున్న ‘విజయ్ దేవరకొండ’ !

Published on Aug 28, 2019 9:08 PM IST

‘విజయ్ దేవరకొండ’ కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే సెన్సేషనల్ హీరోగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగా కూడా మారబోతున్న సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యాంగ్ టాలెంట్ ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు విజయ దేవరకొండ. తన అభిరుచిని పరిచయం చేయబోతున్నాడు. పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. అందుకే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేసే సినిమాలో తరుణ్ లీడ్ రోల్ చేస్తున్నాడు . ఆ మూవీ పేరు “మీకు మాత్రమే చెప్తా ” అని టైటిల్ ను తాజాగా రివీల్ చేశారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలోనే ఫన్ ని జనరేట్ చేశారు విజయ్, తరుణ్.. త్వరలో నే ఈ సినిమా గురుంచి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు