“లైగర్” రూమర్ పై విజయ్ తన మార్క్ రిప్లైతో క్లారిటీ.!

Published on Jun 22, 2021 8:01 am IST

మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం “లైగర్”. తెలుగు మరియు హిందీ భాషలో మాంచి బజ్ ను సెట్ చేసుకున్న ఈ చిత్రంపై లేటెస్ట్ గా ఓ ఊహించని రూమర్ నే బయటకి వచ్చింది.

ఈ చిత్రానికి డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ఆఫర్ గా 200 కోట్లు ఆఫర్ వచ్చింది అని ఓ గాసిప్ యిట్టె వైరల్ కాగా దానికి విజయ్ తన మార్క్ లో రిప్లై ఇచ్చాడు. మరి దానిపై స్పందిస్తూ.. ” ఇది చాలా తక్కువ మించే థియేటర్స్ లో చూపిస్తాను” అని చెప్పాడు.

దీనితో ఓ పక్క ఈ సినిమా అంతకు మించే వసూలు చేస్తుంది అని అలాగే కేవలం థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని విజయ్ కన్ఫర్మ్ చేసేసాడు. సో ఫైనల్ గా ఈ సాలిడ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఛార్మి మరియు బాలీవుడ్ నిర్మాత జోహార్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :