తన ఇమేజీకి భిన్నమైన పాత్రలో ‘క్రేజీ హీరో’

Published on Aug 7, 2018 8:44 am IST

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో ఎవరు అంటే.. ప్రముఖంగా వినిపించే పేరు విజయ్‌ దేవరకొండ. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ యంగ్ హీరో గ్యాప్‌ లేకుండా సినిమాలు అంగీకరిస్తున్నాడు. తాజాగా విజయ్ నటించిన ‘గీత గోవిందం’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతలోనే విజయ్ మరో చిత్రాన్ని మొదలెట్టాశాడు. కొత్త దర్శకుడు భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘డియర్‌ కామ్రేడ్‌’ తెరకెక్కుతుంది.

కాగా ఈ చిత్రకథలో కొన్ని సామాజికాంశాలను ప్రస్తావించనున్నారట. ఇందులో విజయ్ తన ఇమేజీకి భిన్నమైన పాత్రను పోషించనున్నాడు. సామాజిక బాధ్యతలు కలిగిన వ్యక్తిగా ఓ మంచి పాత్రలో విజయ్ కనిపించనున్నాడు.గోదావరి జిల్లా తోండంగిలో సోమవారం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తుండగా సుజిత్‌ సారంగ్‌ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్స్‌ కలిసి నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More