ఛాలెంజ్ పూర్తిచేయలేనని చెప్పిన సెన్సేషనల్ హీరో

ఛాలెంజ్ పూర్తిచేయలేనని చెప్పిన సెన్సేషనల్ హీరో

Published on Apr 24, 2020 10:58 AM IST

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ తన టాస్క్ పూర్తి చేయలేకపోయాడు. దానికి వాళ్ళ అమ్మగారే కారణం. టాలీవుడ్ రియల్ మెన్ ఛాలెంజ్ ఫీవర్ తో ఊగిపోతుండగా చిరంజీవి నుండి వెంకటేష్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ మరియు రాజమౌళి లాంటి డైరెక్టర్స్ ఈ ఛాలెంజ్ పూర్తి చేసి, రియల్ మెన్ అనిపించుకున్నారు. ఐతే దర్శకుడు కొరటాల ఈ ఛాలెంజ్ ని హీరో విజయ్ దేవరకొండ కి విసిరారు. ఐతే విజయ్ దేవరకొండ కొంచెం బిన్నంగా స్పందించారు.

రియల్ మెన్ ఛాలెంజ్ కోసం ఇంటి పనులు చేస్తుంటే విజయ్ వాళ్ళ అమ్మ తిడుతోందట. విజయ్ పని చేయడం వలన ఆమెకు పని తగ్గకపోగా ఇంకా పని పెరుగుతుందట. మా అమ్మ ఇంకా నన్ను చిన్న పిల్లాడిగానే ట్రీట్ చేస్తుంది..రియల్ మెన్ అనుకోవడం లేదు అన్నారు. అందుకే ఈ టాస్క్ చేయలేకపోతున్నాని ఒప్పుకున్న ఆయన… లాక్ డౌన్ లోపు తనకు సంబందించిన ఓ వీడియో గ్లిమ్స్ విడుదల చేస్తాను అన్నాడు.

తాజా వార్తలు