తన మూవీ దుష్ప్రచారం పై స్పందించిన దేవరకొండ

Published on Aug 18, 2019 1:00 am IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ క్రేజీ హీరోలలో ఒకరు. అతితక్కువ కాలంలో విజయ్ యూత్ లో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ మూవీ పరాజయం పాలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైందని చెప్పాలి. కాగా విజయ్ దేవరకొండ మొదటిసారి ఈ మూవీ ఫలితం పై స్పందించారు.

తెలుగు పరిశ్రమలో కొందరు తనపై, తన సినిమాలపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. డియర్ కామ్రేడ్ మూవీ పై నెగెటివిటీ ప్రచారం చేసి ఆ చిత్రాన్ని చంపేశారన్నారు. ఐతే ఇలాంటి తనకేమి కొత్త కాదన్న విజయ్ ఇలాంటి ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు అని గట్టి సమాధానం చెప్పారు. కాగా నిన్న ప్రకటించిన సైమా అవార్డ్స్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు, మరియు సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ కేటగిరీలకు గాను రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :