ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్‌కు విజయ్ ఆఫర్..!

ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్‌కు విజయ్ ఆఫర్..!

Published on Aug 15, 2021 12:44 AM IST

పాపులర్ సింగింగ్ రియాలిటీ షో “ఇండియన్ ఐడల్ 2021” గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం జరగబోతుంది. ఈ సింగింగ్ కాంపిటేషన్‌లో ఫైనల్స్‌కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు హీరో విజయ్ దేవరకొండ ఓ వీడియో ద్వారా బెస్ట్ విషెస్ చెప్పి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అయితే విజయ్ దేవరకొండకు తాను పెద్ద ఫ్యాన్ అని, విజయ్ సినిమాలో పాడటమే తన కోరిక అని షణ్ముక ప్రియ షో నిర్వాహకులకు చెప్పింది. దీంతో సోనీ టీవీ వారు విజయ్ ను షణ్ముక ప్రియకు విషెస్ చెప్పాలని కోరారు.

అయితే ఓ వీడియోతో షణ్ముక ప్రియకు ఆల్ ది బెస్ట్ చెప్పిన విజయ్ ఆమెకు అదిరిపోయే ఆఫర్ కూడా ఇచ్చాడు. టైటిల్ గెలిచినా, గెలవకపోయినా తన నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం షణ్ముకకు ఇస్తున్నట్టు విజయ్ ప్రకటించాడు. ఈ వీడియో చూడగానే షణ్ముక ప్రియ, వాళ్ల పేరెంట్స్ ఆనందంలో మునిగిపోయారు. విజయ్ తన సినిమాలో షణ్ముకకు పాడే అవకాశాన్ని ఇవ్వటాన్ని పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు