టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం ‘రణబాలి’ చిత్రాన్ని సెప్టెంబర్‌లో, ‘రౌడీ జనార్ధన్’ చిత్రాన్ని డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. అయితే, తాజా పరిణామాల ప్రకారం ‘రణబాలి’ షూటింగ్ ఆలస్యం కావడంతో, ఈ సినిమా సెప్టెంబర్ రేస్ నుండి తప్పుకుంది.
అక్టోబర్ దసరా సీజన్ ఇప్పటికే పలు భారీ చిత్రాల విడుదలలతో ప్యాక్ అయిపోవడంతో ‘రణబాలి’ని నవంబర్ లేదా డిసెంబర్ నెలకు వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనిపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. ఒకవేళ ‘రణబాలి’ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్‌లో విడుదల చేస్తే.. అది ‘రౌడీ జనార్ధన్’ రిలీజ్ ప్లాన్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. విజయ్ దేవరకొండ సినిమాల మధ్య సరైన గ్యాప్ ఉండాలి కాబట్టి, ‘రౌడీ జనార్ధన్’ విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సి ఉంటుంది.
‘రణబాలి’ కొత్త రిలీజ్ డేట్ పై ఈ ఏడాది ఆగస్టు నాటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ‘రణబాలి’ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు, రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రూరల్ ఎంటర్‌టైనర్ ‘రౌడీ జనార్ధన్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.


