ఇన్స్టాలో విజయ్ దేవరకొండ మాస్ ఫాలోయింగ్.!

Published on May 19, 2021 2:00 pm IST

ఆనతి కాలంలో టాలీవుడ్ నేటి తరం యువతలో క్రేజీ ఫాలోయింగ్ ను తెచ్చుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. “అర్జున్ రెడ్డి” సినిమా తర్వాత నుంచి విజయ్ క్రేజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. మరి అదే మాస్ ఫాలోయింగ్ ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ లో అయితే వేరే లెవెల్లో ఉంది. తాజాగా విజయ్ ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసాడు.

దీనితో ఈ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ మైల్ స్టోన్ అందుకున్న మొట్ట మొదటి దక్షిణాది హీరోగా విజయ్ దేవరకొండ రికార్డు సెట్ చేసాడు. మరి ప్రస్తుతం ఈ రౌడీ హీరో మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో “లైగర్” అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ఛార్మి మరియు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :