వివాదం పాలైన విజయ్ దేవరకొండ చిత్రం !

వివాదం పాలైన విజయ్ దేవరకొండ చిత్రం !

Published on Sep 17, 2018 3:22 PM IST

nota 16

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం చుట్టూ ఓ వివాదం చోటు చేసుకుంది. అది తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో వార్తల్లో నిలిచింది. ‘నోటా’ చిత్రానికి సంబంధించి ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్‌ వెన్నలకంటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. రచయిత శశాంక్‌ వెన్నలకంటి ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌ రాజా పై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసుకుంది. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ చిత్ర టీజర్‌ కు మంచి స్పందన లభించింది. ‘ఇరుముగన్’ ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు