అక్కడ రికార్డ్ స్థాయిలో విడుదలవుతున్న ‘నోటా’ !

Published on Oct 2, 2018 6:22 pm IST

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 5 వ తేదీన ‘నోటా’ విడుదల కానుంది. ప్రస్తుతం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది.

అయితే తాజాగా ఈ చిత్రం యుఎస్ లో రికార్డ్ స్థాయిలో విడుదల అవ్వబోతుంది. దాదాపు 220 లొకేషన్స్ లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇన్ని లొకేషన్స్ లో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఇక ఇటీవల రిలీజ్‌ అయిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ‘ఇరుముగన్’ ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :