‘గీత గోవిందం’ విజయంతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయిన సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ తమిళ బాషలో నటించిన చిత్రం ‘నోటా’. ‘ఇరుముగన్’ ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తిఅయింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 4న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం తెలుగులో కూడా అదే రోజు విడుదల కానుంది.
ఈసినిమాలో మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం విజయ్ దేవరకొండ మొదటిసారి స్వంతంగా తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకం ఫై ఈచిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం డీయర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు.


