అనుష్క కొత్త సినిమాలో విజయ్ దేవరకొండ?

Published on Jul 3, 2021 4:00 am IST


బాహుబలి సిరీస్‌తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత అగ్రకథానాయిక అనుష్క శెట్టి మళ్ళీ ఇప్పటివరకు పెద్ద హిట్స్ అందుకోలేదు. అయితే వరుస సినిమాలు చేస్తూ కమర్షియల్‌ పంథాకు పోవాలన్న ఆలొచన లేకుండా, భిన్నమైన కథలను ఎంచుకునే పనిలో ఉన్న జేజమ్మ తన తదుపరి సినిమా విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో రూపొందనున్న ఓ ప్రేమకథా చిత్రంలో అనుష్క నటించనున్నట్లు వార్తలు బయటకొచ్చినా దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే ‘రా రా కృష్ణయ్య’ సినిమా దర్శకుడు మహేశ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని 25 ఏళ్ల యువకుడికి, 40 ఏళ్ల మహిళకు మధ్య సాగే ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అనుష్క సరసన నవీన్‌ పోలిశెట్టి నటిస్తున్నాడని, వీరిద్దరు పేర్లు కలిసేలా ఈ సినిమాకు ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రలో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించబోతున్నాడని, కథాగమనంలో అతడి పాత్ర కీలకంగా ఉంటుందన్న కొత్త హింట్ తాజాగా తెరపైకి వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :