విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న వివాహ ఆహ్వాన పత్రిక.. నెట్టింట వైరల్..!

rashmika-vijay

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ వేడుకకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది. తమ కుటుంబాల ఆశీస్సులతో, వీరిద్దరూ ఫిబ్రవరి 26, 2026న అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఒక చిన్న వివాహ వేడుకలో ఒక్కటి కాబోతున్నట్లు ఆ పత్రికలో పేర్కొన్నారు. తమ జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం పట్ల వారు ఎంతో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.

ఈ వివాహం అనంతరం, సినీ ప్రముఖులు మరియు స్నేహితుల కోసం మార్చి 4, 2026 బుధవారం రోజున ఒక ఘనమైన వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్‌లో సాయంత్రం 7 గంటల నుండి ఈ వేడుక జరగనుంది. తమ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఈ వేడుకకు విచ్చేసి తమ నూనత ప్రయాణాన్ని ఆశీర్వదించాలని విజయ్ మరియు రష్మిక ఈ పత్రిక ద్వారా ఆహ్వానించారు.

ఈ ఆహ్వాన పత్రిక బయటకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, అధికారికంగా మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

Exit mobile version