‘వోగ్’ మేగజైన్ లో ‘విజయ్ దేవరకొండ’ !

Published on Oct 10, 2019 6:39 pm IST

యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కొత్త స్టిల్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. పాపులర్ మ్యాగజైన్ ‘‘వోగ్’’ కు విజయ్ ఇచ్చిన ఫోటో షూట్ అందరనీ
ఎట్రాక్ట్ చేస్తోంది. తన సినిమా జర్నీ, లైఫ్ స్టైల్ ఇతర విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. కాగా ఈ ఫోటోషూట్ లో విజయ్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రత్యకేంగా ఏర్పాటు చేసిన ఈ ఫోటోషూట్ లో రౌడీ స్టార్ తన అటిట్యూడ్ అండ్ స్టైల్ తో ఫోజ్ లు ఇచ్చాడు.

ఈ ఫొటోలు చూసి రౌడీ ఫ్యాన్స్ ఖుషీ అవుతన్నారు. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వస్తోన్న ‘‘వరల్డ్ ఫేమస్
లవర్’’ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌ గా వస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More