“ఖుషి” రిలీజ్ పై లేటెస్ట్ బజ్..!

“ఖుషి” రిలీజ్ పై లేటెస్ట్ బజ్..!

Published on Nov 5, 2022 7:08 AM IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఖుషి” కోసం అందరికీ తెలిసిందే. మరి దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. మరి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది.. మరి ఈ చిత్రం రిలీజ్ కి సంబంధించి అయితే ఆల్రెడీ పలు రూమర్స్ ఉన్నాయి. షూటింగ్ త్వరగానే కంప్లీట్ అవుతుండగా బహుశా ఈ ఏడాది లోనే రిలీజ్ ఉంటుంది అని కూడ ఆ మధ్య బజ్ వచ్చింది.

అయితే తర్వాత ఇది వచ్చే ఏడాది జాన్ లేదా ఫిబ్రవరిలో ఉంటుందని తెలియగా ఇప్పుడు ఇది కూడా మారినట్టు తెలుస్తోంది. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం అయితే సినిమా ని మేకర్స్ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారని తెలుస్తోంది. మరి దీనిపై అయితే మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు శివ తనకి హిట్ అయ్యిన లవ్ స్టోరీగా తెరకెక్కిస్తుండగా మంచి అంచనాలు దీనిపై ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు