హ్యాట్సాఫ్..ఆర్గాన్ డోనర్ గా విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం.!

హ్యాట్సాఫ్..ఆర్గాన్ డోనర్ గా విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం.!

Published on Nov 16, 2022 3:59 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ డాషింగ్ హీరోస్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “లైగర్” చిత్రంతో చాలా కాలం తర్వాత ఆడియెన్స్ ని పలకరించాడు. ఇక నెక్స్ట్ అయితే ఇప్పుడు “ఖుషి” సినిమాతో బిజీగా ఉన్న తాను లేటెస్ట్ గా ఓ హాస్పిటల్ సంబంధిత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ న్యూస్ పెద్దగా బయటకి రాలేదు కానీ విజయ్ దేవరకొండ ఆయితే ఈ మీటింగ్ లో ఓ సంచలన నిర్ణయమే తీసుకున్నాడని చెప్పాలి.

మరి పూర్తి డీటెయిల్స్ లోకి వెళితే పేస్ హాస్పిటల్స్ మరియు అందులో డాక్టర్స్ తో తనకి కష్ట కాలంలో ఉన్న పరిస్థితులను చెప్తూ విజయ్ కొన్ని కీలక కామెంట్స్ చేసాడు. తాను ఎవడే సుబ్రహ్మణ్యం చేస్తున్న సమయంలో తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఆ సమయంలో వీరిని సంప్రదించగా వారి వల్లనే ఇప్పుడు మా నాన్న ఆరోగ్యంగా ముందు మీద ఫిట్ గా ఉన్నారని తెలిపాడు.

అందుకే వారు ఆహ్వానించగానే ఈ కార్యక్రమానికి వచ్చానని విజయ్ చెప్పాడు. అలాగే వారితో మాట్లాడుతూ ఆర్గాన్ డొనేషన్(అవయవ దానం) కోసం తెలుసుకున్నానని. ఈ డోనార్స్ వల్ల ఎంతో మంది జీవితాలు రీస్టార్ట్ అవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అని విజయ్ తెలిపాడు. అందుకే నేను కూడా నా ఆర్గాన్స్ అన్నీ డొనేట్ చేసేసానని నా తర్వాత నా పార్ట్స్ వల్ల ఎవరో ఒకరు బ్రతకడం వారిలో నేను కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని ఈ సున్నిత అంశంపై గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

మరి ఈ విషయంలో మాత్రం విజయ్ కి ఖచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే..అలాగే ఆ మధ్య కోవిడ్ సమయంలో కూడా చాలా మంది యువతకి తాను అండగా నిలిచాడు, సేవా కార్యక్రమాలు చేసాడు. ఇప్పుడు ఈ నిర్ణయంతో తన లైఫ్ లో ఓ వ్యక్తిగా మరో ఉన్నతమైన మెట్టు విజయ్ ఎక్కేసాడని చెప్పడంలో సందేహం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు