ఈ రోజు జరుగుతున్న ‘గీత గోవిందం’ ఆడియో వేడుకలో అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలోని ఆయన పాడిన ‘వాట్ ది ఎఫ్’ అనే సాంగ్ ను మొన్న యు ట్యూబ్ లో విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ లోని లిరిక్స్ అభ్యంతరకరంగా ఉండడంతో కొన్ని సంఘాలనుండి విమర్శలు ఎదురయ్యాయి. ఆ దెబ్బతో ఈ సాంగ్ ను యు ట్యూబ్ లోనుండి తీసేశారు.
దీనిపై ఆయన స్పందిస్తూ గత రెండు రోజులుగా నన్ను ఈ పాట పాడినందుకు తిడుతున్నారు. ఈసాంగ్ ఈ రకంగా సెన్సషనల్ అవుతుందనుకోలేదు. అందరికి నచ్చుతుందనే ఉద్దేశముతో పాడాను. కాని కొందరి మనోబావాలు దెబ్బతినడంతో మళ్లీ కొత్త లిరిక్స్ తో నిన్న నా తోనే పాడించారు అని అలాగే ఈ సంధర్బంగా అభిమానులకు మంచి ఆఫర్ ఇచ్చారు. ఈ పాటను నాకంటే ఎవరైనా బాగా పాడేవారు ఉంటే ఆ పాటను పాడి పంపిస్తే అది మాకు నచ్చితే ఈసినిమాలో వారిచేతనే ఈ సాంగ్ పాడిస్తామని అన్నారు. ఇక స్టేజి మీద విజయ్ తన మీద తాను పంచ్ లు వేసుకొని ఆయన మాట్లాడిన తీరు అక్కడున్నవారిని ఆకట్టుకుంది.
