మహేశ్ బాబు – విజయ్ దేవరకొండ పై ఇంట్రస్టింగ్ రూమర్ !

Published on Jun 4, 2019 5:08 pm IST

మహేశ్ బాబు అనిల్ రావిపూడితో చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మే 31వ తేదీన అధికారికంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ రోల్ చేస్తున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ రూమరే వైరల్ అవుతుంది.

కాగా ఈ రూమర్ లో ఎలాంటి నిజం లేదని చిత్రబృందం నుంచి సమాచారం. కేవలం ఇది రూమర్ మాత్రమేనట. అయితే మహేశ్ ఓన్ బ్యానర్ లో విజయ్ దేవరకొండతో ఓ సినిమా నిర్మిస్తే ఎలా ఉంటుందన్నట్లు నమ్రతా ఆలోచిస్తోందట. మరి మహేశ్ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా వస్తోందో లేదో చూడాలి.

ఇక మహేశ్ బాబు ‘మాహర్షి’తో భారీ సక్సెస్ ను అందుకున్న తరువాత చేస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే జగపతి బాబు కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More