నిహారిక సినిమాకి ముఖ్య అతిధిగా సెన్సేషనల్ హీరో !

Published on Mar 22, 2019 12:16 pm IST


మెగా డాటర్ నిహారిక కొణిదెల, యంగ్ హీరో రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సూర్యకాంతం’ విడుదలకు సిద్దమైయ్యింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో సాయంత్రం 6గంటలకు నిర్వహించినున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నాడు.

నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 29న విడుదలకానుంది. ఇక మొదటి రెండు చిత్రాలతో నిరాశపరిచిన నిహారిక ఈచిత్రంతోనైనా హిట్టు కొడుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More